కూటమికి బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు

రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తాం
వినుకొండలోనూ జీవీ గెలుపునకు కృషిచేస్తాం
రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు వెల్లడి

వినుకొండ, మహానాడు : ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన, బీజీపీ కూటమి విజయానికి కృషి చేస్తామని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు. బీసీ, ఎస్సీలపై జరుగుతున్న దాడుల నియంత్రణ, యువత, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతుగా ఉండాలని ఇటీవల గుంటూరు ప్లీనరీ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ట్లు వెల్లడిరచారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలనే సంకల్పంతో ఆరోజు ఏకగ్రీవం గా తీర్మానం చేశామన్నారు. ఈ మేరకు సోమవారం వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాల యంలో జీవీ ఆంజనేయులును కలిసి మద్దతు ప్రకటించారు. అనంతరం మాట్లాడిన కేశన శంకరరావు కూటమికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ బీసీలను ఏకతాటిపైకి తెస్తామన్నారు. వైకాపాలో ఉన్న బీసీ నేతలు సామాజిక న్యాయం కోణంలో తీసుకున్నారే గానీ ఏనాడైనా ఈ రాష్ట్రంలో బలహీనవర్గాలపై దాడులను ఖండిరచారా అని ప్రశ్నించారు.

చట్టసభల్లో బీసీలకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా అని నిలదీశారు. ఈ పరిస్థితుల్లో బలహీనవర్గాలు మొత్తం రాష్ట్రంలో మార్పును కోరుకుం టున్నారని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలో అంబేడ్కర్‌ స్మృతివనంలానే గుంటూరు, విజయవాడ మధ్య మహాత్మా జ్యోతిరావు పూలే స్మృతివనం కూడా ఏర్పాటు చేయాలని చంద్రబాబును కోరామని, దానికి సానుకూలంగా స్పందించి అధికారంలోకి రాగానే ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారని తెలిపారు. జీవీ ఆంజనేయులు ఉమ్మడి గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో పేద ప్రజల హృదయాలను చూరగొన్నారని కొనియాడారు. బలహీనవర్గాలకు అండదండగా ఉంటున్న జీవీ గెలుపునకు కృషి చేస్తామన్నారు. జి.వి.ఆంజనేయులు మాట్లాడుతూ తనకు, కూటమికి మద్దతు ప్రకటించిన బీసీ సంక్షేమ సంఘానికి ధన్యావాదాలు తెలిపారు. గత ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే రుణాలు పెంచుతామని, పెళ్లికానుకను రూ.లక్ష చేస్తామని, విదేశీ విద్యకు ఆర్థిక సాయాన్ని రూ.25 లక్షలు చేస్తామంటూ మభ్యపెట్టి జగన్‌ బీసీలను మోసం చేశారని మండిపడ్డారు.

దాంతోపాటు బీసీ సంఘం నేతలు వైసీపీని చీకొట్టడానికి కారణం… స్థానిక సంస్థల్లో వారి రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి కుదించడమేనని అభిప్రాయపడ్డారు. దాని వల్ల బీసీలు 16,800 పదవులు కోల్పోయారన్నారు. అంతేకాక 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 56 రూపాయలు కూడా ఇవ్వని దద్దమ్మ ప్రభుత్వం వైకాపా సర్కార్‌ అని మండిపడ్డారు. బీసీల పట్ల అతి కిరాతకంగా వ్యవహరించిన జగన్‌ రాష్ట్రంలో పట్టుమని 10 సీట్లయినా గెలుస్తారా అని ప్రశ్నించారు. పల్నాడు జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీ గెలిచే పరిస్థితి లేదన్నారు. 2 లక్షలకు పైగా మెజార్టీతో ఎంపీ సీటును కైవసం చేసుకుంటామన్నారు. వినుకొండలో కూడా ఎమ్మెల్యే బొల్లా అనేకమంది బీసీలను వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే వారంద రికీ తగిన గుణపాఠం చెప్పి తీరాలన్నారు. ఈ ఎన్నికల్లో 160కి పైగా సీట్లను తెలుగు దేశం కూటమి గెలుచుకోపోతుందని జోస్యం చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంలో కార్మికులకు రక్షణ కల్పిస్తామని, రూ.10 లక్షల బీమా సౌకర్యాన్ని తెస్తామన్నారు.