కూటమి నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
సీసీ రోడ్డుకు శంకుస్థాపన
దర్శి, మహానాడు: త్వరలో దర్శి రూపురేఖలే మారబోతున్నాయని కూటమి నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వాన రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. వారి స్ఫూర్తి, చేయూత, ప్రభుత్వ సహకారంతో దర్శి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కూటమి నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. బుధవారం దర్శి పట్టణంలోని 9వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ….
ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్ల మరమ్మత్తులు చేయకుండా.. నూతన రోడ్ల నిర్మాణం పట్టించుకోక పోవడంతో నియోజకవర్గాల అభివృద్ధి దాదాపు కుంటుపడిపోయిందన్నారు. అయితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా గుర్తింపు తెచ్చుకుంటుందన్నారు. అందులో భాగంగానే ప్రధాన రహదారులతో పాటు లింకు రోడ్లు, కాలనీల రోడ్ల నిర్మాణం పై దృష్టి పెట్టామన్నారు.
అదేవిధంగా పట్టణంలోని పార్కుల అభివృద్ధితో పాటు నగర సుందరీకరణ పనులపై కూడా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించే పనిలో ఉన్నామన్నారు. గతంలో చంద్రబాబునాయుడు దర్శి నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయి మద్దతునిస్తామని హామీనిచ్చినట్లు ఆమె గుర్తు చేశారు. ఆ హామీలను నెరవేర్చడానికి తాగునీటి వసతులు, రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు అంచనాలు రూపొందిస్తున్నామని వివరించారు. పార్లమెంటు సభ్యులు మాగంటి శ్రీనివాసరెడ్డి సహకారంతో ఎంపీల్యాడ్స్ కేటాయించి దర్శి నియోజకవర్గాన్ని గతంలో ఎవరూ చేయనంత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, మున్సిపల్ కమిషనర్ మహేష్, DE రహీమ్, మున్సిపల్ వైస్ చైర్మన్ తో పాటు పలువురు 9వ వార్డ్ కౌన్సిలర్ వై. సరస్వతి – వై. వి. సుబ్బయ్య, కౌన్సిలర్లు పసుపులేటి శేషమ్మ – దత్రాత్రేయ, నక్క రంగా, దినకర్, రాంగిరి, శ్రీనాద్, తెలుగు యువత అధ్యక్షులు పుల్లలచెరువు సత్యనారాయణ (చిన్నా ), వివిధ హోదాల్లో ఉన్న నేతలు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.