– ఉపాధ్యాయ ఎమ్మెల్సీ టీ.కల్పలతా రెడ్డి
నియోజకవర్గ విద్యా కుటుంబం వరద బాధితులకు అందించిన సహాయం అపూర్వమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ టీ.కల్పలతారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపు మేరకు నియోజకవర్గ విద్యా కుటుంబం సమీకరించిన రూ.29,78,185లతో 2,600 వరద బాధిత కుటుంబాలకు వంటపాత్రలు, కుక్కర్ల పంపిణీ కార్యక్రమం పురస్కరించుకొని శనివారం రాత్రి మోపిదేవి మండలం కే.కొత్తపాలెంలో 360 వరద బాధిత కుటుంబాలకు వంట పాత్రలు, కుక్కర్లను ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అతిధులుగా విచ్చేసి అందచేశారు. ఈ సందర్భంగా వరద బాధితుల కోసం రూ.మూడు లక్షలు సేకరించి ఇచ్చిన ఎస్.వీ.ఎల్ క్రాంతి విద్యాసంస్థల చైర్మన్ దుట్టా ఉమామహేశ్వరరావును సత్కరించారు.