వైన్, ఇసుక మీద ఉన్న శ్రద్ధ మంచినీళ్ల మీద లేదు

– గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విమర్శ

నరసరావుపేట, మహానాడు: గురజాలలో ఈరోజు నీళ్లు కూడా లేని దుస్థితి ఏర్పడింది… దాచేపల్లిలో ప్రజలు మంచినీరు తాగాలి అంటే భయపడాల్సిన పరిస్థితి ఉంది… గత ఐదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదు… దాచేపల్లిలో డయేరియాతో ఇద్దరు చనిపోవడం బాధాకరమని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఆయన మీడియాతో ఏమన్నారంటే.. ప్రభుత్వం కనీసం మంచినీళ్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు… మాకు మంచినీళ్లు లేవని జిల్లా అధికారులకు ఫోన్ లు చేసినా పట్టించుకోలేదు.

పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నేతలకు వైన్, ఇసుక మీద ఉన్న శ్రద్ధ మంచి నీళ్ల మీద లేదు… పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను అదుపులోకి తేలేకపోతున్నారు… దాచేపల్లిలో డయేరియాతో మృతి చెందిన రెండు కుటుంబాలకు 50 లక్షల చొప్పున ఎక్సగ్రేషియా ఇవ్వాలి… మంచినీరు బాగోలేవని స్థానిక టీడీపీ కౌన్సిలర్ దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదు… మున్సిపల్ అధికారులు ఒక్కరు కూడా అందుబాటులో ఉండటం లేదు… మంచినీరు ఇవ్వడంలో స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.