బీజేపీ, కాంగ్రెస్‌ దుష్ప్రచారాలు సిగ్గుచేటు

మెదక్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి

మెదక్‌, మహానాడు: రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక మీడియాకు లీకులు ఇచ్చి తప్పుడు వార్తలు రాయించి లబ్ధిపొందాలని బీజేపీ, కాంగ్రెస్‌ కలిసి ప్రయత్నించడం సిగ్గు చేటని మెదక్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో పోటీ కూడా చేయని నన్ను ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఉన్నట్టు కథలు అల్లి ప్రచారం చేయడం బట్ట కాల్చి మీద వేయడమేనని వ్యాఖ్యా నించారు. ఓటమి తప్పదని గ్రహించి రెండు పార్టీలు చేతులు కలిపి కుట్ర పన్ని దిగజారాయన్నారు. నా మనో స్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు..ఎవరెన్ని కుతంత్రాలు చేసినా ప్రజలు తన వైపే ఉన్నారని, దుష్ప్రచారం మాని సిద్ధాంతాల పరంగా ఎన్నికల్లో తలపడాలని హితవుపలికారు.