చీఫ్‌ సెక్రటరీని ఎన్నికల విధుల నుంచి తప్పించాలి

-అసైన్డ్‌ భూములపై విచారణ జరిపించాలి
-జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి

గుంటూరు: అసైన్డ్‌ భూముల విషయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డిని ఎన్నికల విధుల నుంచి తప్పించా లని జనచైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్‌ కమిటీ ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది. గురువారం గుంటూరు జన చైతన్య వేదిక హాలులో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జవహర్‌రెడ్డిపై అనేక అభియోగాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో కౌంటింగ్‌ సక్రమంగా జరగడం కోసం ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అసైన్డ్‌ భూములను అమ్ముకోవటానికి అవకాశం కల్పిం చిన 596 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

జీవో విషయం ముందుగానే తెలుసుకున్న అవినీతిపరులైన అధికారులు, రాజకీయ నేతలు వేలాది ఎకరాలు కొనుగోలు చేశారని అన్నారు. ఒక అంచనా ప్రకారం 65 వేల ఎకరాల అసైన్డ్‌ భూమి అన్యాక్రాంతమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం భూ బాగోతాలపై సీబీఐ తో విచారణ జరిపించాలని లేదా హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలని కోరారు. చీఫ్‌ మినిస్టర్‌ ఆఫీసులో ఉన్న ఒక ఉన్నతాధికారి కమీషన్‌ ద్వారా పొంది న వందలాది కోట్ల రూపాయలను వెచ్చించి అసైన్డ్‌ భూములను కొనుగోలు చేసిన ట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మౌనం వీడి శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో ప్రోగ్రెసివ్‌ ఫోరమ్‌ కన్వీనర్‌ పి.వి.మల్లికార్జునరావు, అఖిల భారత పంచాయతీ పరిషత్‌ జాతీయ ఉపా ధ్యక్షుడు జాస్తి వీరాంజనేయులు, తెలుగు భాషోద్యమ సమాఖ్య కన్వీనర్‌ డాక్టర్‌ వి.సింగారావు పాల్గొన్నారు.