కృష్ణమ్మ పరవళ్లను ఆసక్తిగా తిలకించిన సీఎం

విజయవాడ, మహానాడు: విజయవాడలో బుధవారం చేనేత దినోత్సవాన్ని ముగించుకుని ఉండవల్లి వెళ్తూ ప్రకాశం బ్యారేజీపై కాన్వాయ్ ఆపి కిందకు దిగి సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణమ్మ పరవళ్లును ఆసక్తిగా తిలకించి పరవశించిపోయారు. వరద ప్రవాహాన్ని చూసేందుకు బ్యారేజీ వద్దకు వచ్చిన సందర్శకులను దగ్గరకు పిలిచి ముచ్చటించారు. కృష్ణమ్మకు జలకళ ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యనించారు. నీటి ప్రవాహాన్ని చూస్తుంటే ఎంతో సంతృప్తిగా ఉందంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలపై తాజా పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.