కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది

దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి
కూరగాయల వ్యాపారులతో మాటామంతీ
సమస్యల పరిష్కారానికి భరోసా

దర్శి, మహానాడు : రాష్ట్రంలో జూన్‌ 4 తర్వాత కూటమి ప్రభుత్వం రాబోతుందని, చిరు వ్యాపారుల సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తానని దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి హామీ ఇచ్చారు. శుక్రవారం ఆమె ఒక సాధారణ మహిళగా కూరగాయల షాపునకు వెళ్లి కూరగాయలు కొంటూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వేసవిలో తాగునీరు సక్రమంగా అందుతుందా, పెరిగిన విద్యుత్‌ చార్జీలతో వ్యాపారాలు ఎలా ఉన్నాయి అని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయేది కూటమి ప్రభుత్వమేనని, సమస్యలు తీరుస్తానని భరోసా ఇచ్చారు. దర్శి పట్టణం లో ప్రతి ఇంటికి కొళాయి ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాల కల్పనకు శాయశక్తులా కృషిచేస్తానని తెలిపారు. ఎన్నికలు ముగిసినా కౌంటింగ్‌ టెన్షన్‌ లేకుండా ప్రజలతో మమేకం అవుతూ దర్శి సమస్యల పరిష్కారానికి ఆమె పడుతున్న తాపత్రయాన్ని స్థానికు లు అభినందిస్తున్నారు.