ఆ రూ.67.52 లక్షలు వసూలు

– అధికారుల సమక్షంలో సెప్టెంబర్ 17 నుంచి చెల్లింపులు
– కలెక్టర్ ప్రశాంతి వెల్లడి

రాజమహేంద్రవరం, మహానాడు: జి. యర్రంపాలెం బ్యాంకు ఆఫ్ బరోడా బ్రాంచి లో దుర్వినియోగం అయిన సొమ్ము రూ.67.52 లక్షలు వసూలు చేశామని, ఈ నెల 17 నుంచి బ్రాంచిలో చెల్లింపులు జరుపుతున్నట్టు కలెక్టర్ పి.ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

బ్యాంక్ ఆఫ్ బరోడా, జి.యర్రంపాలెం బ్రాంచ్ కు చెందిన వ్యాపార కరస్పాండెంట్ ముతాబత్తుల నానిబాబు ద్వారా కస్టమర్ లకు చెందిన డిపాజిట్‌లను దుర్వినియోగం జరిగినట్టు గుర్తించామని తెలిపారు. ఆ మొత్తాన్ని సంబంధిత ఖాతాదారులకు చెల్లింపులు జరపవలసినదిగా బ్యాంకు అధికారులను ఆదేశించామన్నారు.

ఆ మేరకు ఆ మొత్తాన్ని తిరిగి ఖాతాదారులకు చెల్లింపులు జరపాలని బ్యాంకు నిర్ణయించిందని, సెప్టెంబరు 17 మంగళవారం జి.యర్రంపాలెం బ్రాంచి వద్ద జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారు ప్రత్యక్ష పర్యవేక్షణ లో జమ చేయనున్నట్టు తెలిపారు. ఆ రూ. 67.52 లక్షలను M/s విజన్ ఇండియా టెక్ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి వసూలు చేసి, బాధిత కస్టమర్‌లకు మొత్తాలను రీ యింబర్స్ చేయనున్నట్లు బ్యాంకు అధికారులు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు.