దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది

-రాష్ట్రపతి ముర్ము

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి వికసిత్​ భారత్​ లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. దేశం అభివృద్ది పథంలో దూసుకుపోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తూ 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా భారత్​ ఉంటుందని రాష్ట్రపతి ముర్ము అన్నారు.

మేకిన్​ ఇండియాకు అధికప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం జీ 20 సదస్సును విజయవంతంగా నిర్వహించింది. .. ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నామంటూ.. వాతావరణంలో వచ్చే విపత్తులు సమస్యలుగా మారాయన్నారు. 80 కోట్ల మందికి రేషన్​​ ఉచితంగా ఇచ్చామన్నారు. అన్నదాతల వల్లదేశం శుభిక్షంగా ఉందన్నారు.