ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో అద్భుత విజయాలు
ఇరవై తొమ్మిది పతకాలు ఒడిసి పట్టిన భారత్
అంగవైకల్యాలని ఛేదించి
త్రివర్ణం విశ్వ వీధిలో రెప రెపలాడించారు..
వైకల్యాలు లెక్కచేయకుండా
బలహీనతలను ప్రక్కకు నెట్టి
అవయవ లోపాన్ని కనపడకుండా
ఆత్మవిశ్వాసముతో విజయాలందిచారు
బంగారు కొండలు మన భారతీయులు
సాధించారు అద్భుత గెలుపు
ఏడు బంగారు పతకాలతో వన్నెతెచ్చి
ప్రపంచంలో మేటి క్రీడాకారులుగా నిలిచారు..
వెండి వీరుల విజయ గాధలు
విన్నంతనే ఒళ్ళు పులకిస్తుంది
తొమ్మిది పతకాలతో పరవశించిపోయారు
పవిత్ర భూమికి క్రీడ సేవలందించారు..
కాంస్య పతకాలను సాధించిన ధీరులు
పదమూడు పతకాలతో గెలుపొంది
కనీ వినీ ఎరుగని విజయం సాధించి
అథ్లెట్లు అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు..
గతము కంటే భిన్నంగా జయం సాధించి
ఆశలన్నీ మోసుకెళ్లి పతకాలు తెచ్చారు
దృఢ సంకల్పమే ఆయుధంగా
ప్రతి క్రీడలోను విశ్వవిజేతగా నిలిచారు..
తాము ఎవరికీ తీసిపోమంటూ
విశ్వ క్రీడా వేదిక ఘనంగా ముగించారు
జాతీయ పతాక సాక్షిగా చిద్విలాసం చేస్తూ
విజయ గర్వముతో భారత్ వస్తున్నారు…
ఆటేదైన అదిరిపోయే గెలుపు
జాతీయ గీతానికి ఆనంద పరవశం
మెడలో పతాక అలంకారం అపురూప ఘట్టం
జాతి మొత్తం పులకించిపోయే సమయం….
ఆత్మవిశ్వాసమే ఆయుధంగా కదిలినారు
క్రీడారంగములో కీర్తి ప్రతిష్టలు తెచ్చారు
ఒక్కొక్కరూ ఒక యోధునిలా పోరాడి
పతకాలెన్నో మరుపురాని మెరుపులా పట్టారు..
స్వాగతం పలుకుతుంది యావత్ దేశం
మీరు సాధించిన విజయాలకు సలాం చేస్తూ
జాతి గర్వించేలా సత్కరించాలి
ప్రతి క్రీడాకారుడి స్వర్ణ యుగం రావాలి..
– కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235