-90 శాతం టీడీపీకే పడ్డాయని అక్రమానికి తెరతీశారు
-సంబంధం లేకుండా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు
-సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టినా బుద్ధి మారలేదు
-రాష్ట్రానికి పట్టిన వైసీపీ క్యాన్సర్‌కు జూన్ 4న మందు
-టీడీపీ నేత, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు
మంగళగిరి: ఎలక్షన్ కమిషన్ పోస్టల్ బ్యాలెట్ మీద ఇచ్చిన సర్క్యులర్‌పై వైసీపీ నాయకులకు వచ్చిన భాషలో మాట్లాడుతున్నారు…ఏదైనా కాగితం ఇచ్చినప్పుడు దానిని ముందు చదవాలి..రాకపోతే ఎవరితోనైనా చదివించుకోవాలి. ఎలక్షన్ కమిషన్ లాంటి వ్యవస్థతో పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కరెక్ట్ కాదని ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు వ్యాఖ్యానించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈసీని తాము ఒకటి కోరితే వైసీపీ ఏదేదో ఊహించుకుని మాట్లాడుతుందని మండిపడ్డారు. టీడీపీ వైరస్ ఎలక్షన్ కమిషన్‌కు సోకిందని సజ్జల మాట్లాడటం సమంజసం కాదు. టీడీపీ వైరస్ కాదు…వైసీపీనే క్యాన్సర్.
స్టాంప్ వేయకపోవడం ఓటరు తప్పుకాదు
పలానా రూల్స్‌లో బ్యాలెట్ పేపర్ మీద ఆర్వో పాస్ మెయిల్, సిగ్నేచర్ లేకపోతే రిజక్ట్ చేసే ప్రొవిజనల్ లేదని మేము ఎలక్షన్ కమిషన్‌ను అడిగాం. జూలై 19న ఇచ్చిన సర్క్యులర్ రూల్‌లో ఇది ఉంది. కౌంటింగ్‌లో ఆర్వోలకు తెలియకుండా ఇన్ వాలిడ్ అని పక్కన పెడతారని ముం దుగా చెప్పాం. పోస్టల్ బ్యాలెట్ ఇచ్చినప్పుడు 13(ఏ) ఉంది. గజిటెడ్ ఆఫీసర్ స్టాంప్ వేయకపోవడంతో ఓటర్ తప్పు కాదు అది ప్రభుత్వం బాధ్యత కాబట్టి ఇటువంటి వాటిపై ఎలక్షన్ కమిషన్ క్లారిఫై చేయాలి. అందుకోసం సర్క్యులర్ ఇవ్వాలని అడిగాం. మే 18న ఎలక్షన్ కమిషన్‌ని మళ్లీ కలిసి దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరాం. అందుకు ఎలక్షన్ కమిషన్ సానుకూలంగా స్పందించి ఢిల్లీ అధికారులతో మాట్లాడి మే 25న క్లారిఫై ఇచ్చారు. కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సర్క్యులర్‌లో పేరా 3లో పార్ట్ 10లో ఈ అంశం ఉంది.
ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్పింది
పోస్టలో బ్యాలెట్ మీద ఫాం 13ఏ, బీపై ఓటర్ సంతకం లేకపోయినా, గజిటెడ్ సంతకం లేకపోతే తీసివేయమని చెప్పింది. అయితే ఫాస్ మెయిల్ వేయకపోతే బ్యాలెట్ తీసేయమని ఎక్కడా లేదు. బ్యాలెట్ సీరియల్ నెంబర్‌ను కౌంటర్ ఫైల్స్ తో వెరిఫై చేసుకుని ట్యాలీ అయితే వ్యాలిడ్ బ్యాలెట్‌గా తీసుకోమని ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెప్పింది. పోస్టల్ బ్యాలెట్ కవర్‌పై ఓటరు సంతకం పెట్టని సమయంలో వాటిని వెరిఫై చేసుకుని పరిగణలోకి తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. డిక్లరేషన్‌పై గజిటెడ్ ఆఫీసర్ స్టాంప్ లేకపోయినా, ఫాస్ మెయిల్ బ్యాలెట్ పేపర్‌పై లేకపోయినా, పోస్టల్ బ్యాలెట్ కవర్‌పై ఓటరు సంతకం లేక పోయినా ఈ మూడు అంశాల్లో బ్యాలెట్‌ను తిరస్కరించకూడదు. ఎన్నికల కమిషన్ ను ఒక రూల్ ఫాలో కావాలని కోరాం. అయితే నాయకులు మేము ఇచ్చిన కాగి తం చదవకుండా సంబంధం లేని ఫిర్యాదు చేశారు. కోర్టుకు వెళతామని వైసీనీ అంటోంది. కోర్టులపై వైసీపీకి గౌరవం ఎక్కడుంది. వైసీపీ నాయకులపై 400కి పైగా కేసులు ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోండి. పోస్టల్ బ్యాలెట్ అధికారులం దరూ వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. 4.97 లక్షల ఓట్లల్లో 2 శాతం ఇన్ వాలిడ్ ఓట్లను తీసేస్తే మిగిలిన వాటిల్లో 90 శాతం వైసీపీకి వ్యతిరేకంగా పడ్డాయి. దాంతో సాధ్యమైనంత వరకు పోస్టల్ బ్యాలెట్‌ను తగ్గించే కుట్ర పన్నారు.
కాగితం పంపిస్తాం..చదువుకోండి
రాష్ట్రానికి పట్టిన వైసీపీ క్యాన్సర్‌ని పోగొట్టే మందు జూన్ 4న రాబోతుంది. లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున, పేర్ని నాని, కిషోర్ బాబు, మద్దాళి గిరిధర్, నారాయ ణమూర్తిలకు మేము ఎలక్షన్ కమిషన్‌కు ఇచ్చిన కాగితం పంపిస్తాం…పూర్తిగా చదువుకోండి. ఏదో అల్లరి చేయడానికి మీ బలహీనతలను భయటపెట్టుకోవడానికి ఎలక్షన్ కమిషన్‌కు కాగితం ఇచ్చారు. సుప్రీంకోర్టుతో మొట్టికాయలు వేయించుకు న్నా వైసీపీ నాయకులకు సిగ్గు రాలేదు. మేము ఎలక్షన్ కమిషన్‌కు 750 కాగితాలు ఇస్తే రెండు క్లారిఫికేషన్స్ ఇచ్చారు. అందులో ఒకటి ఆర్వోలకు చెప్పి ఎలక్షన్ ఏజెంట్ల మీద పోలీస్ వెరిఫికేషన్ కావాలని లిస్ట్ ముందే రాజానగరం ఆర్వో ఇచ్చారు. అది రూల్‌లో ఎక్కడా లేదు. రూల్ ప్రకారం మూడురోజులు ముందు మాత్రమే ఆర్వోలకు కౌంటింగ్ ఏజెంట్ల లిస్ట్ ఇవ్వాలని ఉంది. ఇవేమి వైసీపీ నాయకులకు వర్తించవు. అనంతపురంలో 800 మంది కేసులు పెట్టి అండ్ అదర్స్ అన్నారు. అంటే టీడీపీ ఏజెంట్లను అందులో చేర్చే కుట్ర పన్నారు. దానికి ఎలక్షన్ కమిషన్ అడ్డుకట్ట వేసింది. అందుకే వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడు తున్నారు. వైసీపీ నాయకులు ఏదైనా ఫిర్యాదు చేసే ముందు ఆలోచించి కాగితం విడుదల చేయాలని చెబుతున్నామని హితవుపలికారు.