పాపాల రాయుడి పాపం పండే రోజులు దగ్గరపడ్డాయి

– కాకాణి జీవితం – ఫేక్ ప్రచారాలకే అంకితం
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

వేదయపాలెం : నెల్లూరు నగర పరిధిలోని వేదయపాలెంలో ఉన్న సోమిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం వెంకటాచలం మండలం కసుమూరు పంచాయతీకి చెందిన 20 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో టిడిపి లో చేరాయి.

సర్వేపల్లి టీడీపీలోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి.ఎన్నికల నాటికి సర్వేపల్లిలో వైసీపీ పూర్తిగా ఖాళీ అవడం ఖాయం. సర్వేపల్లి టీడీపీలో జోరుగా కొనసాగుతున్న చేరికలతో కుదేలైన వైఎస్ఆర్సిపి. నానాటికి తెలుగుదేశం పార్టీ మరింత బలమైన శక్తిగా తయారు కావడంతో తట్టుకోలేని కాకాణి చేరికల విషయంలో ఫేక్ ప్రచారాలు చేసుకుంటున్నాడు.

సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు సర్వేపల్లిలో టీడీపీ – జనసేనలకు పట్టం కట్టడానికి సిద్ధమైపోయారు. సర్వేపల్లి టీడీపీలోకి వలసలు నానాటికి మరింత ఉదృతమయ్యాయి. టీడీపీలో చేరే వారిని కాకాణి అనేక విధాలుగా బెదిరిస్తున్నాడు.. కాకాణి బెదిరింపులకు ఎవరు భయపడే పరిస్థితిలో లేరు. సర్వేపల్లిలో టీడీపీ దూకుడు పెంచడంతో వైసీపీ చతికిలపడిపోయింది.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సర్వేపల్లిలో కాకాణికి డిపాజిట్లు కూడా రావు. ఓటమి భయంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న కాకాణి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు.