భూపాలపల్లి: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఈ నెల 16న జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. వారిలో భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగకు చెందిన మావోయిస్టు అగ్ర నేత సుధాకర్ అలియాస్ శంకర్రావు, ఆయన భార్య సుమన అలియాస్ రజిత ఉన్నారు. వారిద్దరి భౌతికకాయాలు శుక్రవారం స్వగ్రామానికి చేరుకున్నాయని బంధువులు చెప్పారు. కాగా శంకర్రావుపై రూ.25 లక్షల రివార్డు ఉంది.