జగన్‌పై రాయి దాడి డ్రామా కేసు సీబీఐకి అప్పగించాలి

-ఆయన రంగస్థల నాటకం అదుర్స్‌
-కూటమి గెలుస్తుందనే భయంతో వేషాలు
-హత్యకు గులకరాయి ఉపయోగిస్తారా?
-సెక్యూరిటీ సిబ్బంది ఏమి చేస్తున్నారు?
-అతడికి దాడి ఘటన ముందే తెలుసు
-టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
-ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు

అమరావతి, మహానాడు: జగన్‌పై రాయి దాడి కేసు సీబీఐకి అప్పగించాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆదివారం ఎలక్షన్‌ కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. నదిలో కొట్టుకుపోయేవాడు తన ప్రాణాలను రక్షించుకోవడం కోసం ఏది కనపడి నా దాన్ని ఆసరాగా తీసుకొని బయటపడి ప్రాణాలు రక్షించుకోవాలని ప్రయత్నం చేస్తాడు. అదే పరిస్థితి మన ముఖ్యమంత్రి జగన్‌లో కనిపిస్తోందన్నారు. తాను అధికారాన్ని కోల్పోతున్నానని అర్థమైంది. కూటమి సహాయంతో చంద్రబాబు మరలా అధికారంలోకి రాబోతున్నట్లు జగన్‌ తెలుసుకున్నాడు. అందుకే ఏదో ఒక రకంగా తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం నిన్న తనపై ఎవరో రాయి వేసి తనను చంపాలని చూశారని, తనపై హత్యాయత్నం జరిగిందని ఒక స్టేజి డ్రామా క్రియేట్‌ చేశారని వ్యాఖ్యానించారు. ఇది జగన్మోహన్‌ రెడ్డి, వారి బృందం ఆడిన డ్రామా అని ప్రజలకు తెలిసిపోయిందని, ఎవరైనా చిన్న గులకరాయితో అందు లో సీఎం అంతటి వ్యక్తిని హత్యా ప్రయత్నం చేస్తారా? హత్య చేయాలంటే గొడ్డళ్లు, కత్తులు, తుపాకులు ఉపయోగిస్తారు. చిన్న గులకరాయితో చంపడానికి ఎవరై నా బుద్ధున్న వాడు ప్రయత్నం చేస్తారా? అన్ని ప్రశ్నించారు.

జగన్‌ ఆడిన రంగస్థల నాటకం
అదంతా ఒక నాటకం. జగన్‌ ఆడిన రంగస్థల నాటకం. ఇటువంటి డ్రామాలాడి ప్రజలను మభ్య పెట్టాలనే ఆలోచన మానుకోవాలని హితవు పలికారు. 5 సంవత్సరాల క్రితం ఇలాగే కోడికత్తి డ్రామా ఆడారు. ఈ మధ్య ఫన్నీ పోలీసులు తయారయ్యారు. హాస్యాస్పదంగా వ్యవహరించే పోలీసులే ఎక్కువగా కనపడుతు న్నారు. చంద్రబాబునాయుడుపై అనేకసార్లు దాడులు జరిగాయి. ఎప్పుడూ హత్య యత్నం కేసు రిజిస్టర్‌ చేయలేదు. జగన్‌ పైన చిన్న గులక రాయి పడితే హత్యా యత్నం కేసు నమోదు చేశారు. ఆ వంకతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

బాగోతాన్ని బయటకు తీయాల్సిందే
జగన్‌ కింద పనిచేస్తున్న ఈ లోకల్‌ పోలీసులలతో దర్యాప్తు చేయిస్తే ఈ గులక రాయి బాగోతం బయటకు రాదు. జగన్‌ డ్రామా బయటపడదు. అందుకే ఎలక్షన్‌ కమిషన్‌ను కలిశాం.. ఛీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌ను కలిశాం. కేసు సీబీఐ దర్యాప్తుకు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ఈ రాయి జగన్‌కు తగిలి పక్కన ఉన్న వెల్లంపల్లికి కూడా తగిలిందట. అక్కడున్న సెక్యురిటీ వారికి తగలలేదే? కేవలం ఒకరికి తగిలి జారి పడుతుంది అంతే. తలకు తగిలి మళ్లీ వేరే వారికి కూడా అదే చోట ఎలా తగులుతుంది? ఇది హాస్యాస్పదమన్నారు… భద్రతా సిబ్బంది అంతా కూర్చున్నారు. జగన్‌ ఒక్కడే నిలబడి ఉన్నాడు. చీకటిలో సెక్యురిటీ ఆఫీస ర్‌ తల మీద చేయిపెట్టి కిందకు వంచి కూర్చో బెడతాడు. కరెంటు పోయినప్పుడు కూర్చో బెట్టి రాయి పడేవరకు ఉంచారు. రాయి పడుతుందని సెక్యురిటీ ఆఫీసర్లకు, వారి బృందానికి, జగన్మోహన్‌ రెడ్డికి ముందే తెలుసు. జగన్‌ తలకు తగిలి ఇటు వస్తుందని వెల్లంపల్లికి కూడా తెలుసు. నేను వెల్లంపల్లికి హెచ్చరిం చాను. వెల్లంపల్లికి కన్ను పోయే ప్రమాదం ఉందని చెప్పాను. ఈ నాటకాన్ని రక్తి కట్టించడం కోసం నీ కన్ను కూడా పీకేసే ప్రమాదముంది. జాగ్రత్తగా చూసుకోమ ని కూడా చెప్పాను. బాబాయిని వేసేసిన వారికి ఇదొక లెక్కా? వెల్లంపల్లి కన్ను పోతే ఒక లెక్కా? అందుకే వెల్లంపల్లికి కన్ను కాపాడుకోమని చెప్పాను. ఈ డ్రామాలన్నీ బయటకు రావాలి…ఇది కూడా కోడికత్తి డ్రామాలాంటిదేనని ప్రజలకు తెలుసు. గులకరాయితో హత్య యత్నం కూడా ఒక డ్రామానే. ప్రజలు ఇటువంటి డ్రామాలను నమ్మరన్నారు.

పది నిమిషాలకే ధర్నాలా?
రాయి పడిన పది నిమిషాలకే నారాసుర రాక్షసుడు అనే ప్ల కార్డులతో ధర్నా చేశారు. దీన్ని బట్టి ధర్నాకు ముందే రెడీ అయ్యారని తెలుస్తోంది. నారా సుర రాక్షసుడు అని రాయాలంటే ఎంత టైమ్‌ పడుతుంది. గంటా, రెండు గంటలు పడుతుంది. ఆర్డరివ్వాలి…దాని ప్రూఫ్‌ చూడాలి…వెళ్లి తీసుకురావాలి. పది నిమిషాల్లో 10 ప్రెస్‌ మీట్‌లు పెట్టారు అంటే… ఇది జరుగుతుందని వారికి ముందుగానే తెలుసు. ఈ నాటకమంతా బయట పడాలంటే సీబీఐ దర్యాప్తే ఏకైక మార్గం. సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఢల్లీిలో చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్‌కు కూడా ఫిర్యాదు ఇస్తున్నామని తెలిపారు.

అతడికి ముందే తెలుసు…
నాలుగు రోజుల క్రితం అవుతు శ్రీధర్‌ రెడ్డి అనే ఒక సంఘ విద్రోహ శక్తి జడ్జీలను తిట్టిన కేసులో 90 రోజులు జైల్లో ఉన్నాడు. నాలుగు రోజుల్లో రాష్ట్రంలో పెద్ద సంచలనమైన సంఘటన జరగబోతోంది అని ఒక ట్వీట్‌ పెట్టాడు. ఒక నేరస్థుడు ఇలాంటి ట్వీట్‌ పెట్టినప్పుడు డీజీ సీతారామాంజనేయులు పట్టుకుని ఏం జరగబోతోందో అడగాలి. ఇంటెలిజెన్స్‌ కళ్లు తెరచి జాగ్రత్తగా దర్యాప్తు చేసి ఉంటే ఇది జరిగేది కాదు. నాలుగు రోజుల్లో జరగబోయే ఆ సంఘటన ఇదే. జగన్‌ ఒంటిపై రాయి దాడి డ్రామా. ఈ డ్రామా అవుతు శ్రీధర్‌ రెడ్డికి ముందే తెలుసు. అందుకనే ఇది ప్రీ ప్లాన్డ్‌ డ్రామా అని ముందే తెలుసు కనుక ఈ డ్రామా బయటకు రావాలంటే సీబీఐ దర్యాప్తు జరగాలని డిమాండ్‌ చేస్తున్నాం. అదైతేనే జగన్‌ కోడికత్తి డ్రామా, ఈ గులకరాయి డ్రామా బయటకు వస్తాయి. జగన్‌ ఆడిన ఈ డ్రామా అంతా బట్టబయలవ్వాలి. ప్రజలకు తెలియాలి. అందుకే సీబీఐ దర్యాప్తు కోరుతున్నాం. జనసేన, బీజేపీ అందరం కోరుకునేది ఇదే. ఈ కార్యక్ర మంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఎన్నారై వింగ్‌ ప్రెసిడెంట్‌ కోమటి జయరాం, అధికార ప్రతినిధులు పిల్లి మాణిక్యరావు, పాతర్ల రమేష్‌, బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులు బుచ్చి రాంప్రసాద్‌, టీడీపీ నేతలు మక్కెన సుబ్బారావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాతూరి నాగభూషణం, జనసేన నేత గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు.