ఉమ్మడి రాజధాని గడువును పొడిగించొచ్చు

రాష్ట్రపతి ఆర్డినెన్స్‌ జారీ చేయొచ్చు
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ట్వీట్‌

విశాఖపట్నం :  ఉమ్మడి రాజధాని గడువును మరో పదేళ్లు పొడిగించొచ్చని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. మరో వారంరోజుల్లో ఉమ్మడి రాజధాని గడువు ముగియనుండటంతో ఆయన చేసిన ట్వీట్‌ వైరలవుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు హైదరాబాద్‌ నగరం పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉం ది. ప్రస్తుతం కాలపరిమితి ముగుస్తుండగా ఏపీకి రాజధాని లేదు. ఈ క్రమంలో రాష్ట్రపతి హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచేలా ఆర్డినెన్స్‌ జారీ చేయడాన్ని పరిశీలిస్తారని ట్వీట్‌ చేశారు.