కోల్‌కతా: హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ తండ్రి ప్రభుత్వ పరిహారాన్ని నిరాకరించారు.’నా కుమార్తె మరణానికి పరిహారంగా డబ్బు తీసుకుంటే అది ఆమెను బాధిస్తుంది.అందుకే వద్దని చెప్పా. నా కూతురికోసం లక్షలాది మంది పోరాటం చేస్తున్నారు.వారంతా నా కూతుళ్లు, కొడుకులే.కేసు విచారణలో ఉన్నందున CBIకి ఇచ్చిన వివరాలను బయట చెప్పలేను. నిందితులను కఠినంగా శిక్షిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.’ అని తెలిపారు.