మెరుగైన వైద్యం అందించడమే కూటమి లక్ష్యం

– రూ. 48 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ లను అందజేసిన ఎమ్మెల్యే కొండబాబు

కాకినాడ, మహానాడు: రాష్ట్రాన్ని ఆరోగ్య రాష్ట్రంగా తీర్చిదిద్ది, రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ సిటీ శాసన సభ్యులుడు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన 48 లక్షల రూపాయల చెక్ లను 18 కుటుంబాలకు కొండబాబు పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం వైద్యాన్ని పూర్తిగా విస్మరించి పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడే విధంగా పాలన సాగించిందని, అధికారం చేపట్టిన వెంటనే కూటమి ప్రభుత్వం విద్యా వైద్య పై ప్రత్యేక దృష్టి సారించి పాలన చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుమ్మల సునీత, మేడిశెట్టి ఈశ్వరరావు(చిన్ని) పసగడుగులు శేషగిరిరావు, పొంగా బుజ్జి, నీలకాయల సన్నీ, రిక్కా లక్ష్మి, అమలకంటి బలరాం, రెడ్నం సత్తిబాబు, తెప్పల రామలింగేశ్వరరావు, సతీష్, తాడిచర్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.