ఇసుక నిల్వలపై తాజా పరిస్దితిని ప్రకటించిన ప్రభుత్వం

విజయవాడ: రాష్ట్రంలో 28వ తేదీ బుధవారం నాటికి 56 నిల్వ కేంద్రాలలో 16,65,586 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మంగళవారం ఒక్కరోజే 35,523 మెట్రిక్ టన్నుల ఇసుక కోసం 2,739 దరఖాస్తులు గనుల శాఖకు అందాయన్నారు. వీరిలో 2,545 మంది దరఖాస్తు దారులకు 33,181 మెట్రిక్ టన్నుల ఉచిత ఇసుకను అందించటం జరిగిందని మీనా వివరించారు. తేదీ మారే సమయానికి దరఖాస్తుదారులు అందరికే ఇసుక చేరుతుందన్నారు.