మన ఊరు మన బడి కొనసాగిస్తారా? మూసేస్తారా ?
గురుకులాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
హైదరాబాద్: రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన విచిత్రంగా ఉంది. రేవంత్ విధానాలు కేసీఆర్ స్కీం లను ఎత్తివేసే పని లో ఉన్నాడు. కేసీఆర్ మార్కు లేకుండా చేయాలని కుట్ర పన్నారు. టి ఎస్ స్థానం లో టీజీ తెచ్చాడు. రాష్ట్ర చిహ్నం మార్చాలని ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ కారుడు కాదు. ఆయన కు తెలంగాణ చరిత్ర తెలియదు. ప్రజలకు అత్యవసర విషయాలు పక్కన బెట్టి వేరే అంశాలపై రేవంత్ ద్రుష్టి పెడుతున్నాడు. కేసీఆర్ రాష్ట్రం లో గురుకుల విద్యను పటిష్టం చేశారు. రేవంత్ గురుకుల విద్యను తప్పుపట్టేలా మాట్లాడుతున్నారు. నేను సంక్షేమ మంత్రిగా పని చేశా. అనేక రాష్ట్రాలకు మన గురుకులాలు ఆదర్శంగా మారాయి.
ఎందరో బీదల పిల్లలు ఉన్నత స్థానాల్లో ఉండటానికి కేసీఆర్ పటిష్టం చేసిన గురుకుల విద్యే కారణం. రేవంత్ ఏదో స్టడీ రిపోర్ట్ పేరిట గురుకుల విద్యను చిన్నాభిన్నం చేయాలనీ ప్రయత్నిస్తున్నారు. అన్ని వర్గాల గురుకుల పాఠశాలల సంఖ్యను భారీ గా పెంచింది కేసీఆర్ యే. మొత్తం 917 గురుకులాలు స్థాపించారు. ఒక్కో విద్యార్థి పై గురుకుల పాఠశాల ల్లో లక్షా 20 వేల పైనే కేసీఆర్ ఖర్చు చేశారు.
రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు తర్వాత ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ జరిగింది. జూనియర్ ,డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలు కేసీఆర్ సీఎం అయ్యాకే భారీ గా పెరిగాయి. గురుకుల పిల్లలకు రకరకాల పరీక్షలకు కోచింగ్ ఇచ్చే వ్యవస్థను ఏర్పాటు చేశాం. పోటీ పరీక్షల్లో ప్రభుత్వ గురుకులాల విద్యార్థులు సత్తా చాటుతున్నారంటే అది కేసీఆర్ విధానాల ఫలితమే.
సత్ఫలితాలు సాధిస్తున్న ప్రభుత్వ గురుకులాలపై రేవంత్ ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది. గురుకులాలను పెంచాల్సింది పోయి రేవంత్ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. బీసీ ,ఎస్సీ ,ఎస్టీ ,మైనారిటీ వర్గాల విద్యార్థులకు ఉపయోగపడే గురుకుల విద్యను నాశనం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోము.
మన ఊరు మన బడి కేసీఆర్ హయం లో పెట్టిన గొప్ప కార్యక్రమం. అది కొనసాగిస్తారా మూసేస్తారా ప్రభుత్వం ప్రకటించాలి. ప్రభుత్వానికి విద్య పై ఓ పాలసీ అంటూ లేదు.