రైతు సమస్యలను గాలికొదిలిన ప్రభుత్వం

-ఆరునెలలైనా వ్యవసాయ ప్రణాళిక లేదు
-రైతుల అప్పుపై ఎందుకు స్పందించడం లేదు
-బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ

హైదరాబాద్‌, మహానాడు: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతులు వానాకాలం పంటలకు సిద్ధమవుతు న్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించు కోలేదని ధ్వజమెత్తారు. రైతు భరోసా సొమ్ము ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

నకిలీ పత్తి విత్తనాలు పంపిణీ జోరుగా సాగుతోంది. కంపెనీల నుంచి కూడా నకిలీ పత్తి విత్తనాల గురించి సమాచారం అందించినా పట్టించుకోలేదని మండిపడ్డారు. రైతులను ముఖ్యమంత్రి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. రైతులకు సంబంధిం చిన వ్యవసాయ ప్రణాళిక ఆరు నెలలు అయినా ఎందుకు విడుదల చేయలేదని నిలదీశారు. ముఖ్యమంత్రి సాక్షాతూ రైతుబిడ్డ అని చెప్పుకోవడం తప్ప వారి సమస్యలను గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు.

రూ.500 బోనస్‌ ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకూ దాని సంగతి లేదు. తెలంగాణ సివిల్‌ సప్లై వాళ్లు పారదర్శకం గా పని చేయడం లేదు. రూ.58 వేల కోట్ల అప్పుల్లో పౌరసరఫరా శాఖ ఉంది. కాళేశ్వరం కంటే రైతులకు సంబంధించిన అప్పు పెద్ద స్కాం. తెలంగాణ ప్రభు త్వానికి ఏ సంబంధం లేకపోతే ఎందుకు స్పందించడం లేదు. గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో పాటు ఇప్పటి కాంగ్రెస్‌ ఏం లాలూచీ జరిగిందో చెప్పాలని ప్రశ్నిం చారు. రైతులకు సంబంధించిన ప్రభుత్వం చెబుతున్న అప్పులపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్‌ చేశారు.