– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి, మహానాడు: పేద ప్రజల ఆరోగ్యానికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ లక్ష్మి తెలిపారు. ఈ మేరకు ఆమె సొంత వ్యయంతో సీటిజీ మిషన్ ను శనివారం ప్రభుత్వ వైద్యాధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…
విద్య, వైద్యం, ఆరోగ్యం మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. దర్శి ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు పేదలకు అందేందుకు కృషి చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు పేర్కొన్నారు. ఈ యంత్రం గర్భిణులకు సుఖ ప్రసవం కోసం ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యడు నారపుశెట్టి పాపారావు, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్, తదితరులు పాల్గొన్నారు.