– టీడీపీ ఆఫీసులో ఘనంగా జయంతి
మంగళగిరి, మహానాడు: హిందూ సంప్రదాయం ప్రకారం విశ్వకర్మ ఈ ప్రపంచానికి అసలైన సృష్టికర్త. నాడు కృష్ణభగవానుడు పరిపాలించిన ద్వారకానగరంతో పాటు, పాండవులకు ఇంద్రప్రస్థ రాజభవనం, దేవతలకు అనేక రత్నశోభిత నగరాలను ఆయనే నిర్మించాడు. చతుర్ముఖుడైన విశ్వకర్మ ఒక చేతిలో నీటిబిందె, ఒక చేతిలో పుస్తకం, ఒక చేత ఉచ్చు, మిగిలిన చేతులలో వివిధ ఆయుధాలను, పనిముట్లను కలిగివుంటాడని, మంగళవారం ఆ ఘన శిల్పి విశ్వకర్మ జయంతి.. దైవిక వాస్తు శిల్పి అయిన విశ్వకర్మ పుట్టిన రోజును హిందువులు పండుగలా జరుపుకుంటారని పలువురు వక్తలు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి వేడుకలు నిర్వహించారు. విశ్వకర్మ దివ్య వడ్రంగి అని కొనియాడబడ్డారు. మెకానిక్స్, ఆర్కిటెక్చర్ లలో శాస్త్రమైన స్థపత్య వేదంతో ఘనత పొందాడని కూడా రుగ్వేదంలో పేర్కొన్నారు. భారత భూమి వేద, జ్ఞానభూమి అని .. నేడు ఇంజనీర్లు, ఆర్క్ టెక్చర్లు నాటి పురాణ పురుషులను ఆదర్శంగా తీసుకొని వేదాలను, గ్రంథాలను తర్కించి భారత సంస్కృతిని కాపాడేలా నిర్మాణాలను చేపట్టి.. భారతదేశ హితానికి పాటుపడాలని కార్యక్రమంలో పాల్గొన్న నేతలు పేర్కొన్నారు.
కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు అశోక్ బాబు, పి. అనురాధ, మాజీ ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ, నేతలు మన్నవ సుబ్బారావు, ఏవీ రమణ, ధారపనేని నరేంద్రబాబు, హాజీ హసన్ బాషా, హనుమంతరావు, శంకర్ నాయుడు, పీరయ్య, బొద్దులూరి వెంకటేశ్వరరావు, లక్కోజు సత్యనారాయణ, కళిశెట్టి హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.