Mahanaadu-Logo-PNG-Large

కోల్ కతాలో వైద్యురాలు హత్యాచారం ఘటన దారుణం

– బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
– ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ రాష్ట్ర కో – ఆర్డినేటర్ డాక్టర్ జీ ఆదిత్య రెడ్డి

హైదరాబాద్‌: పశ్చిమ బెంగాల్ కోల్ కతా ఆర్‌.జి. కార్ మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌ హత్యాచారం ఘటనను ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ రాష్ట్ర కో – ఆర్డినేటర్ డాక్టర్ జీ. ఆదిత్య రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ డాక్టర్లకు, నర్సులకు ఆదిత్య రెడ్డి తన మద్దతు ప్రకటించారు. వైద్యులు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని డాక్టర్ జీ ఆదిత్య రెడ్డి కోరారు.