చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు
కుటుంబ సాధికార సారథులతో సమావేశం
చిలకలూరిపేట, మహానాడు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వస్తే ఐదేళ్లలో పేదల ఆదాయం రెట్టింపు చేసి తీరుతామని చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు హామీ ఇచ్చారు. పేదలను సంపన్నులను చేసి పేదరికం లేని ఆంధ్రప్రదేశ్‌ను చూడాలన్న చంద్రబా బు సంకల్పంతో పనిచేస్తామని తెలిపారు. శనివారం చిలకలూరిపేట 22, 23వ వార్డుల కుటుంబ సాధికార సారథులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకు లు, కార్యకర్తలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఎన్నికల వ్యూహం, ప్రచార కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఒకవైపు పన్నులు, చార్జీల అదుపు, మరో వైపు ఆదాయ వృద్ధితో ప్రజల్లో కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలు ఎంతో మెరు గుపడే అవకాశం ఉందన్నారు.
ఇంటింటికీ వెళ్లి తెలుగుదేశం మినీ మేనిఫెస్టో, సూపర్ సిక్స్ పథకాలను వివరించాలని సూచించారు. కేంద్రం సహకారంతో పోలవరం, అమరావతి వంటి కీలకమైన పెండిరగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకుంటే నవ్యాంధ్రప్రదేశ్‌ను తిరిగి అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించవచ్చని ఆశాభా వం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.