– వైసీపీ పాలనలో అన్ని రంగాలు భ్రష్టుపట్టుకుపోయాయి
– బాబు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే పారిశ్రామిక రంగంలో కీలక నిర్ణయాలు
– ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు అనుగుణం పరుగులు
– గత ఐదేళ్ళ రాక్షస పాలనలో వ్యవస్థలు అస్తవ్యస్తం
– రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు బాబు ఎన్నుకున్నది పారిశ్రామిక రంగాన్నే…
– దాదాపు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులతో 7.75 ఉద్యోగాలు లక్ష్యంగానే ఇంధన పాలసీ
– ఐదేళ్ల పాలనలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతోనే సీఎం, మంత్రి నారా లోకేష్ అడుగులు
– టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు
మంగళగిరి, మహానాడు: చంద్రబాబు పాలనలో పారిశ్రామిక రంగం పునరుజ్జీవనం పోసుకుందని తెలుగుదేశం(టీడీపీ) ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే… ’’వైసీపీ పాలన అన్ని రంగాలు భ్రష్టుపట్టుకుపోయాయి. జగన్ ను కానీ, వైసీపీ ప్రభుత్వాన్ని కానీ చూస్తే పారిపోయే పరిస్థతికి వచ్చాం. యువత కూడా ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు పడ్డారు. పారిశ్రామిక రంగం అన్ని రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి చూశాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే పారిశ్రామిక రంగానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్ కు అనుగుణం పరుగులు పెట్టిస్తున్నారు. రాక్షస పాలన అనంతరం చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఎన్నుకున్న రంగం పారిశ్రామిక రంగమే. చంద్రబాబు సీఎం అయిన వెంటనే జాతీయ, అంతర్జాతీయ సంస్థలన్ని పెట్టుబడి పెట్టేందుకు క్యూ కట్టాయి. దాదాపు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులతో 7.75 ఉద్యోగాలు లక్ష్యంగానే ఇంధన పాలసీ సిద్ధం చేశారు. ఈ ఐదేళ్ల పాలనలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతోనే సీఎం నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆలోచన చేస్తున్నారు.
యువత భవిష్యత్ కోసమే నారా లోకేష్ ప్రతిరోజు ఆలోచన చేస్తున్నారు. కర్నూలుకు చెందిన టీజీ భారత్ కు పరిశ్రమల శాఖ మంత్రిగా నియమించి ప్రొత్సాహించారు. ప్రభుత్వం యువతకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందనేది. దీన్ని బట్టే అర్థం అవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం మూడు చోట్ల దాదాపు 172 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు లూలూ సంస్థ సిద్ధం అయింది. ఇంకా చాలా సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. చంద్రబాబు సీఎంగా అయిన మరుక్షణమే ఇలా వరుసగా పెట్టుబడులు రావడం సంతోషకరం.
యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా చంద్రబాబు పని చేస్తున్నారు. అదే గత సీఎం జగన్ జే ట్యాక్స్ వసూళ్లే లక్ష్యంగా పని చేశారే తప్ప యువత గురించి ఆలోచన చేసిన దాఖలాలే లేవు. గత ప్రభుత్వం అన్ని రంగాలను భ్రష్టు పట్టిస్తే.. ప్రజల అశీస్సులతో ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఈ ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ సమన్వయంతో పని చేస్తు యువతకు విద్య, ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు పోతున్నాయని తెలియజేశారు‘‘ అని అన్నారు.
అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ’’దేవాలయాలపై, అర్చకులపై, సిబ్బందిపై దాడులు నిరంతరంగా జరుగుతూ ఉండేవి. అనంతపురంలో రథాన్ని దగ్ధం చేసిన ఘటన అందరికి తెలిసిందే. కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని గంటల వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. అది కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి. ఈ 100 రోజుల్లో అర్చకులకు వేతనాల పెంపు, శాంతిభద్రతలు పరిరక్షించే విషయంలో గానీ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
గత ప్రభుత్వ హయాంలో దేవాలయాలకు వెళ్లిన భక్తులు అనేక ఇబ్బందులకు గురయ్యేవారు. చంద్రబాబు అధికారంలోకి భక్తుల సౌకర్యాలు కల్పనే ముఖ్యమని అధికారులకు అదేశాలు ఇస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కాకినాడలో వైసీపీ కౌన్సిలర్ భర్తే అర్చకునిపై దాడికి పాల్పడారు. అలాగే కర్నూలులోని ప్రముఖ ఆలయా చైర్మన్ అర్చకునిపై దాడి చేశారు. కానీ, కూటమి ప్రభుత్వ హయాంలో అర్చకుని వైపు కన్నేటి చూడాలన్న భయపడే పరిస్థితి. దసరా మహోత్సవాల సందర్భంగా ప్రతి ఆలయం వద్ద అన్ని రకాల వసతుల ఏర్పాట్లు చేసేందుకు చర్యలు చేపట్టింది.
వైసీపీ ప్రభుత్వంలో పని చేసిన అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్‌లు అవాకులు చవాకులు పేలుతున్నారు. వారు హయాంలో చేసిన అసాంఘిక కార్యక్రమాల వల్లే ఈ రోెజు మీకు ఈ పరిస్థితి ఏర్పడింది. మార్చుకోకుంటే కనీసం ప్రజా జీవితంలోకి రానివ్వకుండా ప్రజలే మీకు బుద్ధి చెప్తారు.‘‘ అని అన్నారు.