వైసీపీ హయాంలో లిడ్ క్యాప్ ని నిర్వీర్యం చేశారు

– మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి

తాడేపల్లి, మహానాడు: రాష్ట్రంలో లిడ్ క్యాప్ కి మంచి రోజులు వచ్చాయని, ఈ సంస్థ ద్వారా అనేక మందికి స్వయం ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. తాడేపల్లిలోని లిడ్ క్యాప్ కార్యాలయంలో శుక్రవారం ఆ సంస్థ చైర్మన్ గా పిల్లి మాణిక్యరావు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి మాణిక్యరావుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో లిడ్ క్యాప్ ని నిర్వీర్యం చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లిడ్ క్యాప్ కు మంచి రోజులు వచ్చాయని అన్నారు. ఈ సంస్థ ద్వారా అనేక మందికి స్వయం ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. పిల్లి మాణిక్యరావు కష్టపడే వ్యక్తిత్వం ఉన్నవారని, తెలుగుదేశం పార్టీలో నిబద్ధతగా పనిచేసే వారికి గౌరవం దక్కుతుందనే వారికి మాణిక్యరావే ఉదాహరణ అని అన్నారు. లిడ్ క్యాప్ చైర్మన్ గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు.