చెత్తపన్ను ఎత్తివేత హర్షణీయం

– డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

దర్శి, మహానాడు: ‘చెత్త’పన్ను వేసి, వైసీపీ ప్రభుత్వం ప్రజల సొమ్మును దోచుకుందని, అటువంటి పన్నును ఎన్డీయే ప్రభుత్వం ఎత్తివేయడం హర్షణీయమని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పేదల పక్షపాతి చంద్రబాబునాయుడు అని మరోసారి నిరూపితం అయిందని, చెత్త పన్ను వసూళ్లను కూటమి ప్రభుత్వం వచ్చాక రద్దు చేస్తామని చంద్రబాబు చెప్పారని, ఆ మాట ప్రకారం చంద్రబాబు నాయుడు ప్రకటించటం హర్షణీయమన్నారు. చెత్తపన్ను తొలగింపుపై ప్రజల నుండి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని, ఈ పన్ను వసూళ్లపై మొదటి నుంచి టీడీపీ, జనసేన పార్టీలు వ్యతిరేకిస్తూనే ఉన్నాయని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. చెత్త సేకరణ పేరుతో గత ప్రభుత్వం ఇళ్ల నుంచి నెలకు రూ.30 నుంచి రూ.150 చొప్పున వసూలు చేసేదని, ఇలా ఏటా రూ.200 కోట్లు వసూలు చేసేదని విమర్శించారు.