– 10వ డివిజన్ లో తానా ఆధ్వర్యంలో కిట్లను అందచేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్
విజయవాడ: ‘తానా’ ఫౌండేషన్ జన్మభూమిపై చూపుతున్న ప్రేమ మరువలేనిదని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. తానా ఫౌండేషన్ వారు నాణ్యతతో కూడిన సేవా కార్యక్రమాలు అందచేస్తారని చెప్పారు.
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 10వ డివిజన్ పరిధిలోని టవరైన్ రోడ్డులో వరద బాధితులకు తానా ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం గురువారం ఉదయం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్, కార్పొరేటర్ దేవినేని అపర్ణ హజరై బాధితులకు నిత్యావసరాలను అందచేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ.. తానా వారు విజయవాడలో గతంలోనే కాకుండా ఇప్పుడు వరదలు వచ్చిన సమయంలో కూడా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారన్నారు. గతంలో కరోనా వచ్చిన సమయంలో మన దేశంలో లభించని ఎన్నో రకాల మందులను, ఆక్సిజన్ సిలెండర్లను అమెరికా నుంచి తెప్పించి ఇక్కడ ఉచితంగా అందచేశారన్నారు.
ఇప్పుడు తుఫాను, వరదల కంటే పెద్ద విఫత్తు వచ్చిందని, ఇలాంటి సమయంలో బాధితులకు అండగా ఉండేందుకు తానా వారు వచ్చి నిలబడ్డారని చెప్పారు. విజయవాడలో వరదలు వచ్చిన దగ్గర నుంచి నిత్యం ఏదో ఒక ప్రాంతంతో సేవా కార్యక్రమాలను ని ర్వహిస్తూనే ఉన్నారని చెప్పారు. కూరగాయలు, నిత్యావసరాలను అందచేసి వారికి సహయం చేసి పేదలకు అండగా ఉన్నారన్నారు.
తానా వారు ఏ కార్యక్రమం చేసినా నాణ్యమైన సేవలు అందచేస్తారని చెప్పారు. ఇక్కడ పుట్టి, చదువుకుని ఆమెరికాలో స్థిరపడి న వారు ఇక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుకు రావడం నిజంగా అభినందనీయమన్నారు. పేదలకు చేస్తున్న ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింతగా చేసే శక్తి ఆ భగవంతుడు వారికి ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
కార్పొరేట్ దేవినేని అపర్ణ మాట్లాడుతూ వరదల కారణంగా ఇబ్బందులు పడ్డ వారికి అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ప్రజల గురించి ఆలోచనలు చేయడం, సహాయ కార్యక్రమాలు నిర్వహించడం నిజంగా అభినందనీయమన్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తానా వారికి తమ డివిజన్ తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో పుట్టగుంట రమేష్, ముమ్మనేని ప్రసాద్, చెన్నుపాటి క్రాంతి శ్రీ, రత్తయ్య నాయుడు, మన్నే జయప్రకాష్, చలసాని వాసు తదితరులు ఉన్నారు.