భోగాపురం విమానాశ్రయం పేరు అభినందనీయం

– మాజీ ఎమెల్సీ మంతెన సత్యనారాయణ రాజు

విజయవాడ, మహానాడు: భోగాపురం విమానాశ్రయం పేరును అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేయడం అభినందనీయం. ఉద్యమ నేత… త్యాగాల ముద్దుబిడ్డ.. అడవితల్లి లాలించి పెంచిన అల్లూరి.. అందరికి ఆదర్శనీయుడు.. దేశం కోసం ఆయన త్యాగం, ఆయన సాహసం అందరికీ స్ఫూర్తిదాయకమని మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. ఈ మేరకు ఆయనొక ప్రకటన విడుదల చేశారు. నేటి యువత అల్లూరిని ఆదర్శంగా తీసుకోవాలి. విమానాశ్రయానికి అల్లూరి పేరు పెట్టడం వలన దేశం కోసం అమరులైన త్యాగమూర్తులకు ఎనలేని కీర్తిని అందించినట్లే. అమర వీరులకు చంద్రబాబు నాయకత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చేగౌరవం ఇదే. దేశం కోసం దేశ ప్రజల కోసం బ్రిటీష్‌ తూటాలకు గుండెలు ఎక్కుపెట్టి ఎదురొడ్డి నిలబడి అల్లూరి చిందించిన రక్తపు ధైర్య సాహసాలే నేడు ఈ స్వేచ్ఛావాయువులు. అటువంటి అల్లూరి పేరును అంతర్జాతీయ విమానాశ్రయానికి పెట్టడం వల్ల ఆయన కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేయడమే అవుతుందని ఆయన పేర్కొన్నారు.