తెలంగాణ నూతన అధికారిక చిహ్నం!

హైదరాబాద్‌: తెలంగాణ నూతన అధికారిక చిహ్నం రూపకల్పన పూర్తయినట్లు తెలిసింది. చిహ్నంలో అమరవీరుల స్థూపం, మూడు రంగుల జెండా, వ్యవసాయం ప్రతిబింబించేలా వరి వంగడాలు, జాతీయ చిహ్నం(సింహాలు, అశోకచక్రం) ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం అని తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు భాషలలో రాసి ఉంది. దీనిని అధికారికంగా ఇంకా ఖరారు చేయలేదని తెలుస్తుంది. చిహ్నం మార్పుపై ప్రతిపక్షాల నుంచి పెద్దఎత్తున విమర్శల నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో దీనిని ఆవిష్కరిస్తారో లేదో తెలియాల్సి ఉంది.