Mahanaadu-Logo-PNG-Large

వైసీపీ బాధిత ప్రజలకు కొండంత అండ!

సుదీర్ఘ పాదయాత్రలో సమస్యలపై ఆకళింపు
మేనిఫెస్టో రూపకల్పనలో లోకేష్‌ కీలకపాత్ర
తోబుట్టువులా మహిళలకు అండ
యువతకు భరోసా కలిగించడంలో సఫలీకృతం
ఆ నమ్మకంతోనే యువత, మహిళల ఓట్ల వర్షం
మిషన్‌ రాయలసీమతో సీమ ప్రజలకు సాంత్వన

అమరావతి: రాష్ట్రంలో ఐదేళ్ల జగన్మోహన్‌ రెడ్డి అరాచకపాలనలో నరకం చూసిన ప్రజలకు నేనున్నానని భరోసా కల్పించడంలో యువనేత నారా లోకేష్‌ పూర్తి విజయం సాధించారు. 226 రోజుల పాటు జరిగిన సుదీర్ఘ పాదయాత్రలో క్షేత్ర స్థాయిలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను యువనేత ఆకళింపు చేసుకున్నారు. పాదయాత్ర సమయంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను తమ డైరీలో నిక్షిప్తం చేసుకోవడమే గాక ఆయావర్గాల మనోభీష్టాన్ని అధిష్టానానికి తెలియజేసి ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టో రూపకల్పనలో కీలకపాత్ర వహించారు. ముఖ్యంగా జగన్‌ పాలనలో తీవ్ర నిరాశ, నిస్పృహల్లో మునిగిపోయిన యువతకు భరోసా కల్పించడంలో లోకేష్‌ సఫలీకృతులయ్యారు. యువగళం చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న సమయంలో జరిగిన రాష్ట్రవ్యాప్తంగా 107 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించడమే ఇందుకు నిదర్శనం. పాదయాత్ర సమయంలో వివిధ ప్రాంతాల్లో యువతతో నిర్వహించిన ముఖాముఖి సమావేశాల్లో వారి మనోభావాలను తెలుసుకున్నారు. చిత్తూరులో 26వ రోజు యువతతో నిర్వహించిన హలో లోకేష్‌ కార్యక్రమంలో రాష్ట్రంలో పెద్దఎత్తున పరిశ్రమల ఏర్పాటు, యువతకు ఉద్యోగావకాశాల కల్పన, రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధిపథంలో గాడిన పెట్టడానికి తమవద్ద ఉన్న ప్రణాళికలను లోకేష్‌ స్పష్టంగా తెలియజేశారు. ప్రతిఏటా జాబ్‌ క్యాలండర్‌ ద్వారా అయిదేళ్లలో ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వ, ప్రైవేటు, ఉపాధి రంగాల్లో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన, ఉద్యోగం వచ్చే నిరుద్యోగులకు రూ.3 వేల భృతి వంటి అం శాలను మేనిఫెస్టోలో పొందుపర్చడంలో కీలకపాత్ర వహించారు. దీంతోపాటు జగన్మోహన్‌రెడ్డి పాలనలో మహమ్మారిలా తయారైన గంజాయిపై తాము అధికారం లోకి వచ్చిన వందరోజుల్లో ఉక్కుపాదం మోపుతామంటూ తెలుగుదేశం పార్టీ విధానాన్ని సాక్షాత్కరించారు.

తోబుట్టువులా మహిళలకు యువనేత అండ

జగన్‌ పాలనలో భయకంపితులైన మహిళలకు తోబుట్టువు మాదిరిగా మనోనిబ్బరా న్ని కలిగించడంలో యువనేత లోకేష్‌ సఫలీకృతులయ్యారు. యువగళం పాద యాత్రలో లోకేష్‌ ను కలిసి బాధలు చెప్పుకున్న వారిలో అత్యధిక శాతం మహిళలే. పాదయాత్రకు ముందు అరాచకశక్తుల చేతిలో బలైన రమ్య, అనూష ఘటనల్లో జగన్‌ సర్కారు సృష్టించిన అడ్డంకులను అధిగమించి ఆయా కుటుంబాల తరపున న్యాయం కోసం పోరాడారు. రమ్య హత్య తర్వాత ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేపట్టినందుకు తొలిసారి లోకేష్‌ పోలీస్‌ స్టేషన్‌ గడప తొక్కారు. యువనేత పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలను లోకేష్‌ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాకే అధినేత చంద్రబాబునాయుడు మహాశక్తి పథకాన్ని మహానాడు సాక్షిగా చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత దీనిని పార్టీ మ్యానిఫెస్టోలో కూడా పొందుపర్చారు. జగన్‌ పాలనలో బతుకుభారంగా మారి తమ బిడ్డలను చదివిం చుకోలేక పోతున్నామన్న మహిళల వేదనను చూసి వారి కన్నీళ్లు తుడవాలని నిర్ణయించారు. మహాశక్తిలో భాగంగా తల్లికి వందనం కింద ప్రతిబిడ్డకు 15 వేల సాయం, ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ప్రతినెలా 1500 రూపాయల ఆర్థిక సాయం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ప్రతిఏటా ఉచితంగా 3 గ్యాస్‌ సిలిండర్ల హామీలను ప్రకటించడంలో లోకేష్‌ కీలకపాత్ర వహించారు. యువగళం పాదయాత్ర 145వ రోజు నెల్లూరులో నిర్వహించిన మహాశక్తితో లోకేష్‌ కార్యక్రమంలో మహిళల భరోసా, భద్రత కోసం అధికారంలోకి వచ్చాక తాము ఏం చేయబోతున్నామో తెలియజేశారు. జగన్‌ పాలనలో తన తల్లికి జరిగిన అవమానం మరో చెల్లికి జరగనీయబోనని, అధికారంలోకి వచ్చాక మహిళలను అవమానించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని, నిర్భయ చట్టాన్ని అమలు చేయడం ద్వారా పటిష్టమైన రక్షణ కల్పిస్తామని చెప్పారు. మహిళలను గౌరవిం చాలన్న ఆలోచన మనసులో రావాలి. ఇందుకోసం కేజీ నుంచి పీజీ వరకు మహిళలను గౌరవించాలనే ప్రత్యేక పాఠ్యాంశాలు తెచ్చి, సామాజిక చైతన్యం తెచ్చే బాధ్యత తీసుకుంటామని అభయమిచ్చారు. మహిళల వంక కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేస్తామంటూ నెల్లూరు సమావేశంలో సింహగర్జన చేశారు. మహిళల భద్రతకు లోకేష్‌ ఇచ్చిన భరోసా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లవర్షం కురిపించింది.

మిషన్‌ రాయలసీమతో సీమ ప్రజలకు సాంత్వన

ముఖ్యంగా రాయలసీమలో గతంలో ఏ నాయకుడు చేయని విధంగా 124 రోజుల పాటు 1584 కి.మీ పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. ముఖ్యంగా రాయలస ీమలో పాదయాత్ర నిర్వహించే సమయంలో ఎదురైన పలు సంఘటనలు యువనే త లోకేష్‌ను కదిలించాయి. యువగళం పాదయాత్ర 81వ రోజు మంత్రాలయం నియోజకవర్గంలో కొనసాగుతున్న సమయంలో కోసిగికి చెందిన 20 మంది వలసకూలీలు గుంటూరువెళ్లి మిర్చి కోత పనులు చేసుకొని ఒక వాహనంలో తిరిగివస్తుండగా యువనేత వారిని పలకరించారు. స్థానికంగా పనుల్లేక మూడు నెలలు పనులకోసం గుంటూరు వెళ్లి వస్తున్నామని వారు చెప్పడంతో లోకేష్‌ భావోద్వేగానికి గురయ్యారు. ప్రత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తున్న సమయంలో గుక్కెడు నీటికోసం ప్లాస్టిక్‌ బిందెలతో కి.మీ దూరం వెళ్లడం చూసి చలించిపోయారు. ఇవన్నీ చూశాకే రాయలసీమ ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ కడపలో 119వ రోజు (7-6-2023)న నిర్వహించిన సదస్సులో మిషన్‌ రాయలసీమను ప్రకటించారు. ఈ సదస్సులో టీడీపీ అధికా రంలోకి వచ్చాక మిషన్‌ రాయలసీమ పేరుతో రాబోయే అయిదేళ్లలో ఏంచేస్తామనే విషయమై లోకేష్‌ విస్పష్టమైన విధానాన్ని ప్రకటించారు. పెండిరగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేయడం ద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు, 90 శాతం సబ్సిడీతో డ్రిప్‌ ఇరిగేషన్‌, హార్టీకల్చర్‌ హబ్‌గా రాయలసీమను మార్చడం, హార్టీకల్చర్‌ పంటల కోసం రీసెర్చ్‌ సెంటర్ల ఏర్పాటు, వాటర్‌ గ్రిడ్‌ ద్వారా 24/7 ఇంటింటికీ సురక్షిత మైన మంచినీరు, ఆటోమోటివ్‌, ఎలక్ట్రానిక్‌ పరిశ్రమల ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, రాయలసీమలో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు, శ్రీశైలం కేంద్రంగా రాయలసీమను పర్యాటక కేంద్రంగా అభివద్ధి చేయడం… టెంపుల్‌ టూరిజం, ఎకో టూరిజం, టైగర్‌ ఏకో టూరిజం ఏర్పాటు ద్వారా గిరిజనులు, చెంచులకు ఉపాధి అవకాశాలు కల్పించడం మిషన్‌ రాయలసీమలో అంతర్భాగా లుగా ఉన్నాయి. జగన్మోహన్‌ రెడ్డి తమకు తిరుగులేదని అనుకున్న రాయలసీమలో తెలుగుదేశం సాధించిన ఘన విజయాల వెనుక లోకేష్‌ ముద్ర స్పష్టంగా కన్పించింది.