పోలీసులు గతంలో చేసిన పనులనే మళ్లీ చేస్తున్నారు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ 

అమరావతి,మహానాడు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎంగా ఉన్న రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్దితిపై ఆందోళన చెందాల్సిన పరిస్దితి నెల్కొంది అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి ఉన్న ఇంటి దగ్గరకు వెళ్లి దాడికి వెళ్ళటం సరైన పద్దతి కాదని అన్నారు. గతంలో వైసీపీ ఇదే తరహా దాడులకు పాల్పడింది. ఒక ఎంపీనే ఊర్లోకి రానివ్వం అంటూ ఆయనపైనే కేసులు పెట్టడాన్ని మేము ఖండిస్తున్నాం అని రామకృష్ణ తెలిపారు.శాంతిభధ్రతలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించాలి. పోలీసులు గతంలో చేసిన పనులనే మళ్లీ చేస్తున్నారు.

వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతాం అని తెలిపారు. ప్రభుత్వం రైతులకు రైతుభరోసా నిధులు వెంటనే అందించే ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. అలాగే కేంద్రం రాష్ట్రానికి సాయం అందించాలని..ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. ఏపీని దగా చేసింది కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వమే అని ఆయన గుర్తుచేసారు.
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాము.