Mahanaadu-Logo-PNG-Large

ముందు తరం వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు..

– ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి

విజయవాడ, మహానాడు: మనకంటే ముందు తరం వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు జరిగాయి. ఎంపీ జాతీయ జెండా ఎగురవేసి, మాట్లాడారు.

ఐకమత్యాన్ని కూడా పరి రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉంది. ఆనాడు నలభై కోట్ల‌మంది‌ దేశ ప్రజలు ఈ స్వతంత్ర పోరాటంలో భాగస్వామ్యం అయ్యారు. ఇప్పుడు మన దేశ జనాభా 144 కోట్లు ఉన్నారు. దేశ ప్రజలంతా ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. ప్రపంచ దేశాలు మన దేశం వైపు నేడు చూస్తున్నాయి.

కొన్ని దేశాల కుట్ర ల నేపథ్యంలో భారతీయులంతా ఒకటే అనే భావనతో ఉండాలి. 2040 నాటికి వికసిత భారత్ చూడాలనేది లక్ష్యం. వికసిత ఏపీ కోసం మనం అంతా కలిసి పని‌చేయాలి. రాష్ట్ర అభివృద్ధి కి అంకితం అయి ముందుకు సాగాలి. మొన్న ఎన్నికలలో ‌ప్రజలు‌ కూటమికి తిరుగు లేని అధికారం ఇచ్చారు. ప్రజల సమస్యలు పరిష్కారం కోసం బీజేపీ వారధి కార్యక్రమం ప్రారంభించారు. నేటి నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారు. ప్రజలు సమస్యలు పరిష్కరించి వాటిని ఒక యాప్ లో‌కూడా పెడతాం. ప్రజలకు సేవకులుగా పని చేసి.. వారి కన్నీరు తుడుస్తాం.