ఈ పురుగు ధర.. అక్షరాలా 75 లక్షలట

(జానకీదేవి, తణుకు)

నమ్మలేకపోయినా ఇది నమ్మాల్సిన నిజం. అసలు ఒక కీటకమేమిటి? అన్నేసి లక్షల ధర పలకడమేమిటని కదా మీ అందరి ఆశ్చర్యం? అవును. మరదే ఆశ్చర్యం! వివరాలు తెలిస్తే నోరెళ్లబెట్టాలంతే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకాలలో ‘స్టాగ్ బీటిల్’ ఒకటి. ఈ పురుగును ప్రమాదకర వ్యాధులకు సంబంధించిన మందుల తయారీ కోసం పెద్ద ఎత్తున ఫార్మా కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. దానివల్ల అంతరించిపోయే కీటకాల జాతుల జాబితాలో స్టాగ్ బీటిల్ కూడా చేరిపోయింది. అయితే.. ఒక స్టాగ్ బీటిల్ కీటకానికి రూ.75 లక్షల దాకా రేటు వస్తుందని అంటున్నారు. ఈ కీటకాలు సాధారణంగానైతే 3 నుంచి 7 సంవత్సరాలు బతుకుతాయి.