వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకున్న టీడీపీ శ్రేణులు

నందిగామ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిచి కూటమి అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో టీడీపీ నేతలు కొల్లూరు వెంకటేశ్వరరావు, శైలజ నెహ్రూ నగర్ లో వేంచేసియున్న శ్రీదేవి – భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. నందిగామ ఎమ్మల్యేగా తంగిరాల సౌమ్య, విజయవాడ పార్లమెంట్ సభ్యులుగా కేశినేని శివనాథ్ (చిన్ని) భారీ మెజారిటీతో గెలిచి కూటమి ప్రభుత్వం ఏర్పడటం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రజా పాలన అందించటం సంతోషకరమని వారు ఆశాభావం వ్యక్తం చేసారు.

స్థానిక నేతలతో కలసి నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీదేవి – భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.