-బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.డి.విల్సన్
విజయవాడ: దేశంలో దళితులకు ఎవరూ చేయనంత ద్రోహం జగన్ చేశారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.డి.విల్సన్ అన్నారు. ఎన్నికల ఫలితాలపై విల్సన్ స్పందిస్తూ దళితులకు, గిరిజనులకు, బీసీలకు జగన్ చేసిన ద్రోహం వల్లే ఓటమి పాలయ్యారని అన్నారు. వైసీపీలో మగ్గే దళిత నేతలు ఆ పార్టీని వీడి పక్కకు రావాలని పిలుపు ఇచ్చారు. జగన్ రద్దు చేసిన 27 పథకాలను చంద్రబాబు పునరుద్ధరించాల్సి ఉందని తెలిపారు. అదే విధంగా డాక్టర్ సుధాకర్, కిరణ్, సుబ్రహ్మణ్యం మరణాలపై మళ్లీ విచారణ జరిపి నేరస్తులను శిక్షించాలన్నారు. సుబ్రహ్మణ్యంను హత్య చేసిన అనంతబాబు బెయిల్‌ను రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ ద్వారా పోస్టులు భర్తీ చేసి యువతను ఆదుకోవాలని కోరారు.