ఆ విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలి

– ఎస్ఎఫ్ఐ డిమాండ్‌

విజయవాడ, మహానాడు: కొన్ని ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యాసంస్థలు రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రత్యేక తరగతుల నిర్వహిస్తున్నాయని ఆ విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కృష్ణాజిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అడ్మినిస్ట్రటివ్ డైరెక్టర్ వి. మనోహర్ నాయక్‌ కి గురువారం మెమోరాండం ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కృష్ణాజిల్లా కమిటీ కార్యదర్శి ఎస్. సమరం మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన మచిలీపట్నం, జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఒక పాఠశాల కూడా విద్యా శాఖ ఉత్తర్వులు అమలు చేయడం లేదని అన్నారు. ఉదయం 7:45 నిమిషాల నుండి రాత్రి 8 గంటలకు వరకు ప్రత్యేక తరగతుల పేరుతో క్లాసులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ప్రత్యేక తరగతులు పేరుతో సాయంత్రం 8 గంటల వరకు తరగతులు నిర్వహించడం ప్రతి సంవత్సరం పరిపాటిగా మారిందన్నారు.