గ్రామసభల్లో చేసిన తీర్మానాలు పల్లె పండుగ కార్యక్రమంలో అమలు

– నిడదవోలు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో “పల్లె పండుగ వారోత్సవాలు” కార్యక్రమంలో పాల్గొని దాదాపు రూ.3 కోట్ల విలువైన 50కి పైగా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి దుర్గేష్

నిడదవోలు: గ్రామసభల్లో చేసిన తీర్మానాలు పల్లె పండుగ కార్యక్రమంలో అమలు చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం నిడదవోలు రూరల్, ఉండ్రాజవరం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన మంత్రి దుర్గేష్ దాదాపు రూ.3 కోట్ల విలువైన 50కి పైగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

అందులో భాగంగా విజ్జేశ్వరంలో రూ.35.15 లక్షలతో 10 పనులు, కలవచర్లలో రూ. 26.35 లక్షలతో 3 పనులు, జీడిగుంటలో రూ.18.25 లక్షలతో 3 పనులు, కోరుపల్లిలో రూ. 32 లక్షలతో 15 పనులు, పెండ్యాలలో రూ. 36.31 లక్షలతో 6 పనులు, మునిపల్లిలో రూ. 19.36 లక్షలతో 3 పనులు, శెట్టిపేటలో రూ.35.26 లక్షలతో 4 పనులు, తాళ్లపాలెంలో రూ.25.76 లక్షలతో 5 పనులు, ఉండ్రాజవరం మండలంలోని వెలివెన్నులో రూ. 54.20 లక్షలతో 9 పనులకు మంత్రి దుర్గేష్ శంకుస్థాపన చేశారు.

అంతేగాక గోపవరం గ్రామంలో “మన బడి-మన భవిష్యత్” క్రింద మండల పరిషత్ పాఠశాలలో నిర్మించనున్న అదనపు తరగతి గది ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.