సమాజ అభివృద్ధిలో కమ్మవారి పాత్ర గొప్పది

– మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

అమరావతి, మహానాడు: సమాజ అభివృద్ధిలో కమ్మవారి పాత్ర గొప్పదని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. మోతడక గ్రామంలో మంగళవారం కాకతీయ కన్వెన్షన్ సొసైటీ వారితో నిర్మితమైన సీనియర్ సిటిజన్స్ కంఫర్ట్ హోం శ్రీ నిలయం ను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. వ్యాపారాలు అభివృద్ధి తో పాటు సంపాదించిన సంపాదనలో ఎంతో కొంత సమాజం కోసం ఉపయోగపడాలన్న మహోత్తర లక్ష్యంతో ముందుకు వెళ్లడంలో వారు గొప్పవారు అని కొనియాడారు. ఇందులో భాగంగానే ఇలాంటి కన్వెన్షన్ సెంటర్లు, సేవా కార్యక్రమాలు వృద్ధుల ఆశ్రమాలు నెలకొల్పడం కమ్మవారి కే సాధ్యమని వెంకయ్య నాయుడు కొనియాడారు

అభివృద్ధి చెందుతున్న రాజధాని అమరావతిలో నేడు ప్రారంభిస్తున్న సీనియర్ సిటిజన్స్ భవన నిర్మాణం ప్రఖ్యాతి గడిస్తుందని, ప్రజల అవసరాలు తీరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కమ్మవారి ఆలోచనలు బ్రాహ్మణుల వర్గాల ఆలోచనలు ముందుచూపుతో కూడుకొని ఉంటాయన్నారు. కష్టపడి వ్యాపారాలు చేయడం, వారి కుటుంబాల అభివృద్ధి చేసుకోవడం, అన్ని దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తూ సొంత ప్రాంతాల అభివృద్ధికి పాటుపడడం, సమాజ హితం కోరడం, కమ్మ సంఘం కు మాత్రమే సాధ్యమని అన్నారు. ఇదే స్ఫూర్తిని రాబోయే తరాలకు కూడా అందించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్, ఎరపతినేని శ్రీనివాస్, భాష్యం ప్రవీణ్, గల్లా మాధవి, నజీర్ అహ్మద్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, కామినేని శ్రీనివాస్, నన్నపనేని రాజకుమారి, కాకతీయ కన్వెన్షన్ సొసైటీ కమిటీ పెద్దలు, కమ్మ జన ప్రముఖులు, పలువురు హాజరయ్యారు.