రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా పురోగమిస్తోంది

– మంత్రి సవిత

అవనిగడ్డ, మహానాడు: ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా పురోగమిస్తోందని మంత్రి సవిత అన్నారు. ఈ మేరకు ఆమె కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో బుధవారం పర్యటించారు. ఆమెకు నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్, నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. మోపిదేవి గురుకుల పాఠశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతులు, మెనూ పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో నూతన భవనాలు నిర్మిస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం అన్న క్యాంటీన్ల పునరుద్ధరించిందని, ఉచిత ఇసుక హామీలు ఇప్పటికే అమలు చేశామని చెప్పారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అవినీతి గుట్టలుగా బయటకు వస్తోందన్నారు.