చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి అవసరం

తెనాలి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌
జనసేన ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు

గుంటూరు జిల్లా తెనాలి, మహానాడు : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు బోస్‌ రోడ్డులోని తెనాలి జనసేన కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన భారీ కేకును జనసేన పార్టీ పీఏసీ చైర్మన్‌, ఎన్డీఏ కూటమి తెనాలి అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ కట్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు నాయకత్వం అవసరమన్నారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాల నలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందన్నారు. పూర్వ వైభవం రావాలంటే ఎన్డీఏ కూటమి అధికారం లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వేడుకల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.