-చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు
-శ్రీరామనవమి సందర్భంగా రామాలయాల్లో పూజలు
చిలకలూరిపేట, మహానాడు: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ శ్రీరామచంద్రుడిని కోరుకున్నట్లు మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ శ్రీరామనవమి నుంచి ప్రతి ఇంట్లో లోటు అన్న మాట లేని ప్రజాపాలనకు బాటలు పడాలని మనస్ఫూర్తిగా వేడుకున్నామన్నారు. బుధవారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నాదెండ్ల మండలం ఎండుగుంపాలెం, బుక్కాపురం, సంకురాత్రిపాడు రామాలయాలను ఆయన సందర్శించారు.
సీతారామ, లక్ష్మణులకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మాట్లాడిన ప్రత్తిపాటి పాలకుడు సమర్థుడు, ముందుచూపు ఉన్న వాడైతేనే ఆ దేశం, రాష్ట్రం బాగుపడుతుంద న్నారు. ఐదేళ్ల కష్టాల చెర విడిపించేందుకు కీలకంగా మారిన ప్రస్తుత ఎన్నికలతో అంతా ఆ దిశగానే ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమాన్ని మేళవించి పాలన అందించే చంద్రబాబు నాయకత్వాన్ని ప్రతిఒక్కరూ బలపరచాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం సహా పెండిరగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి ఆగిపోయిన అమరావతిని పూర్తి చేసుకోవడం ద్వారా తిరిగి పట్టాలె క్కించవచ్చని ప్రజలందరికీ సూచించారు. చంద్రబాబు, పవన్, మోదీ త్రిమూర్తుల నాయకత్వంలో అవన్నీ నెరవేరడానికి సంపూర్ణ అవకాశాలున్నాయని అందుకోసం ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలని కోరారు.