గుంటూరును…గుంటలూరుగా మార్చారు
పశ్చిమ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి
29వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం
రాష్ట్రానికి పట్టిన శని జగన్‌రెడ్డి అని, ఆ శని నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలపై ఉందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి పిలుపు నిచ్చారు. ఆదివారం 29వ డివిజన్‌లోని రామిరెడ్డి నగర్‌లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. స్థానిక సమస్యలపై మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
స్పందించిన ఆమె డ్రైనేజీ సమస్యలు కూడా తీర్చలేని స్థితిలో అధికార పార్టీ నేతలు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరును గుంటలూరు గా మార్చింది వైకాపా ప్రభుత్వం కాదా? అభివృద్ధి విషయంలో స్థానిక వైకాపా కార్పొరేటర్లు కౌన్సిల్‌లో బహిరంగంగా అసహనం వ్యక్తం చేసిన విషయం వాస్తవం కాదా? ప్రశ్నించారు. మేము ప్రజల తరపున ప్రశ్నిస్తే మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో వైకాపాకు చూపిస్తానని ఆమె సమాధానమిచ్చారు.