న్యూఢిల్లీ: కోల్‌కతా హత్యాచార ఘటన కీలక మలుపు తిరిగింది. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. సీజేఐ ధర్మాసనం మంగళవారం విచారణ జరపనున్నది. అయితే, ఈ కేసుపై ఇప్పటికే సీబీఐ విచారణ కొనసాగుతోంది. సీబీఐ విచారణ జాబితాలో మాజీ ప్రిన్సిపాల్ సందీప్‌తో పాటు మరో 40 మంది ఉన్నారు. నిందితుడు సంజయ్‌రాయ్ మానసిక స్థితిని వైద్యులు విశ్లేషించనున్నారు. ఇదిలావుండగా, హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతుండడంతో రాష్ట్రాల్లోని శాంతి భద్రతలపై కేంద్ర హోం శాఖ దృష్టిసారించింది.