-ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ అధ్యక్షుడు దేవిప్రసాద్
హైదరాబాద్, మహానాడు: సిద్దిపేటలో రాజకీయ సమావేశంలో పాల్గొన్నారన్న నెపంతో 106 ఉద్యోగులను సస్పెండ్ చేయడం సరికాదని ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ అధ్యక్షుడు దేవిప్రసాద్ విమర్శిచారు. తమ సమస్యలపై చర్చించుకోవడానికి ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న సమావేశానికి మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి వెళ్లి ఓటు వేయాలని కోరారని అన్నారు. దీనిని సహించలేని బీజేపీ, కాంగ్రెస్, పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం దారుణమన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా తమ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓటర్లను కలవడం ఎన్నికల్లో సహజమైన ప్రక్రియ అన్నారు. ఉద్యోగులు ఎన్నికల ప్రచారం నిర్వహించలేదని, ఆ సమావేశం ఎన్నికల కోసం ఉద్యోగులు నిర్వహించింది కాదని తెలిపారు. ఎన్నికల ముందు ఉద్యోగులను భయ బ్రాంతులకు గురిచేసే రాజకీయాలకు తెరలేపిన బీజేపీ, కాంగ్రెస్ వైఖరిని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల కమిషన్ ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపి ఉద్యోగులపై నిజా నిజాలు నిగ్గు తేల్చి సస్పెన్షన్ రద్దు చేయాలని కోరారు.