తెలంగాణ లో 55 లక్షలకు పైగా సభ్యత్వాల లక్ష్యం

– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్ రావు

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా మరోసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.సెప్టెంబరు 2వ తేదీన ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. సెప్టెంబరు 3వ తేదీన తెలంగాణలో కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

తెలంగాణ రాష్ట్రంలో 55 లక్షలకు పైగా పార్టీ సభ్యత్వాలను స్వీకరించే లక్ష్యంతో ముందుకెళ్తాం.సెప్టెంబరు 4, 5 వ తేదీల్లో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. సెప్టెంబరు 6వ తేదీన మండలాల వారీగా లాంచింగ్ ప్రోగ్రాం ఉంటుంది. ఆక్టోబరు 2 నుంచి 25 వరకు క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమంపై క్యాంపెయినింగ్ నిర్వహిస్తాం.

తెలంగాణలో గతంలో 11 లక్షల 85వేల సభ్యత్వాలు ఉండేవి. ఈసారి ప్రతి బూత్ లో 200 పై చిలుకు సభ్యత్వాలు స్వీకరించాలని లక్ష్యం నిర్దేశించుకున్నాం.ప్రపంచంలోనే 12 కోట్ల సభ్యత్వాలతో కమ్యూనిస్టు పార్టీ చైనా రికార్డును బద్దలు కొట్టింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. మరోసారి బిజెపి నెలకొల్పిన రికార్డును తిరగరాసేలా దేశ వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.

తెలంగాణ రాష్ట్రంలో మెంబర్ షిప్ డ్రైవ్ కోసం ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ షాప్ లు నిర్వహిస్తున్నాం.ఆగస్టు 30 నాగోల్ శివారులో సంయుక్త మోర్చాలు, అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదుకు సంబంధించి వర్క్ షాప్ నిర్వహిస్తాం.

నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణకు గత పదేళ్లలో 9.50 లక్షల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి చేసింది. తెలంగాణ ప్రజలు బిజెపి పై దృఢమైన నమ్మకంతో ఉన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 8 సీట్లలో విజయం అందించారు.

బిజెపి సభ్యత్వం తీసుకునేందుకు 4 మార్గాలు ఉన్నాయి.

• 1) 88 00 00 2024 కు మిస్డ్ కాల్,
• 2) నమో యాప్/ వెబ్ సైట్,
• 3) QR కోడ్,
• 4) మెంబర్ షిప్ ఫారమ్.

తెలంగాణలోనూ బిజెపి అతిపెద్ద పార్టీగా ఆవిర్భావించేలా ప్రజలు ఆశీర్వదించాలని కోరుతున్నాం.. దేశం కోసం, ధర్మం కోసం పాటుపడే భారతీయ జనతా పార్టీలో చేరండి. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణంతో పాటు అనేక దశాబ్ధాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను నరేంద్ర మోదీ ప్రభుత్వం పరిష్కరించింది. మోదీ పాలనలో భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద, బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది.

నరేంద్ర మోదీ సారథ్యంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధిపరంగా దూసుకుపోతోంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఆదరించి పెద్దఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం.