మొక్కులు తీర్చుకున్న తెదేపా శ్రేణులు

నందిగామ, మహానాడు:  చంద్రబాబు ముఖ్యమంత్రిగా, తంగిరాల సౌమ్య ఎమ్మెల్యేగా విజయం సాధించినందుకు గాను మండల తెదేపా నాయకులు మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో చందర్లపాడు మండల క్లస్టర్ ఇంచార్జ్ ఉన్నం నరసింహారావు ఆధ్వర్యంలో 209 కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని సత్యమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ మండల పార్టీ నేతలు పాల్గొన్నారు.