ఒక మహిళ మృతి, నలుగురికి గాయాలు
నరసరావుపేట, జూన్ 3: నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం వద్ద రాత్రి తులసి ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, డ్రైవర్‌తో సహా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు, 19 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి.
బస్సు కర్ణాటక నుండి యానాం వెళుతోంది. బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నారు. రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షం కారణంగా రోడ్డుపై పడిపోయిన చెట్ల కొమ్మలను తప్పించబోయే ప్రయత్నంలో బస్సు బోల్తా కొట్టినట్లు సమాచారం.
మృతి చెందిన మహిళ విజయవాడకు చెందిన దివ్యగా గుర్తించారు. ఆమెతో పాటు ప్రయాణిస్తున్న ఆమె 10 ఏళ్ల కొడుకు వరుణ్‌కు కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారందరినీ నరసరావుపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.