బాధితులకు సత్వర న్యాయం చేయాలి

మహిళా మోర్చా అధ్యక్షురాలు నడ్డి నాగమల్లేశ్వరి 

గుంటూరు, మహానాడు:  బాధితులకు సత్వర న్యాయం చేయాలని మహిళా మోర్చా అధ్యక్షురాలు నడ్డి నాగమల్లేశ్వరి అన్నారు. చేబ్రోలులో 8వ తరగతి విద్యార్థిని శైలజ అనుమానస్పద మృతిపై గుంటూరు మహిళా మోర్చా అధ్యక్షురాలు నడ్డి నాగమల్లేశ్వరి ఆధ్వర్యంలో మహిళా మోర్చా ఉపాధ్యక్షులు సైదారాణి, కోశాధికారి డాక్టర్ స్రవంతి, కార్యదర్శి మహాలక్ష్మి బాధిత కుటుంబ సభ్యులను గుంటూరు జీజీహెచ్ లో పరామర్శించారు.  ఘటన గురించి వారు వాకబు చేశారు.  శైలజ మేనత్త నిందితుణ్ణి త్వరగా పట్టుకొని తమ బిడ్డ మరణానికి కారణమైన అతన్ని ఉరి తెస్తే కానీ మాకు న్యాయం జరిగినట్టు గా భావించం అని ఆవేదన వ్యక్తం చేయగా నాగమల్లేశ్వరి వారికి సత్వర న్యాయం జరిగేలా తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు.